ఎర్రగడ్డలో కలకలం..పోలీసుల అదుపులో విదేశీయులు
By రాణి Published on 16 April 2020 10:50 PM IST
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. దీంతో ఎక్కడ విదేశీయులు కనిపించినా స్థానిక అధికారులు లేదా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవలే వారు విదేశాల నుంచి వచ్చి ఉంటే గనుక వెంటనే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. తాజాగా..గురువారం సాయంత్రం ఎర్రగడ్డ మీదుగా మూసాపేట్ వైపు కారులో వెళ్తున్న విదేశీ యువతి, యువకులను పోలీసులు సనత్ నగర్ పోలీసులు అడ్డుకున్నారు.
పవన్ కల్యాణ్ లో ఆ విషయం చూసే వరుణ్ స్ఫూర్తిపొందాడట..!
వారు ఏ దేశాల నుంచి వచ్చారో పోలీసులు ప్రశ్నించగా..ఇద్దరు చైనీయులు కాగా..మరొకరు నాగాలాండ్ నుంచి వచ్చినట్లు తెలిసింది. ఈ ముగ్గురు 8 నెలలుగా కూకట్ పల్లిలో నివాసముంటున్నప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కు తరలించనున్నట్లు సనత్ నగర్ పోలీసులు వెల్లడించారు. తెలంగాణ లో ఇప్పటి వరకూ 700 కరోనా కేసులు నమోదవ్వగా 18 మంది మృతి చెందారు. 496 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రోగ నిరోధక శక్తి కోసం బత్తిని చూర్ణం వాడుతున్నారా ? ఇదొక్కసారి చూడండి..