రోగ నిరోధక శక్తి కోసం బత్తిని చూర్ణం వాడుతున్నారా ? ఇదొక్కసారి చూడండి..

By రాణి  Published on  16 April 2020 2:15 PM GMT
రోగ నిరోధక శక్తి కోసం బత్తిని చూర్ణం వాడుతున్నారా ? ఇదొక్కసారి చూడండి..

బత్తిని ఆయుర్వేద నిలయంలో మొలకెత్తిన ఆశాదీపం..కరోనా పై కోవిడ్ అభయ యుద్ధం పేరుతో ఓ ముఠా మేమిచ్చే చూర్ణాన్ని ఆహారంలో రెండ్రోజుల పాటు 6 మోతాదుల్లో తీసుకుంటే కరోనా మీ జోలికే రాదంటూ ప్రజలకు మాయ మాటలు చెప్పి వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటోంది. 175 ఏళ్ల చరిత్ర కలిగిన బత్తిని కుటుంబం ఏటా కొన్ని వేల మందికి చేపమందును ఉచితంగా పంపిణీ చేస్తోంది. అలాంటి బత్తిని పేరును వాడుకుంటూ ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని బత్తిని రాజ్ కుమార్ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఆన్ లైన్ లో ఆయుర్వేద చూర్ణం అమ్మకాలు మొదలు పెట్టాడు. బత్తిని వారు అందిస్తున్న మందు కదా చాలా బాగా పనిచేస్తుంది కావచ్చని నమ్మిన కొందరు ఆ చూర్ణాన్ని రూ.285 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కోవిడ్ 19 ను నయం చేసే మందు అని మాయమాటలు చెప్పి బహిరంగంగా కూడా విక్రయాలు మొదలుపెట్టారు. అనుమానం వచ్చిన కొందరు ప్రముఖులు బత్తిని ఫ్యామిలీని ఈ చూర్ణం గురించి ప్రశ్నించగా తాము అలాంటివేమీ తయారు చేయడం లేదన్నారు.

Also Read : ఇంట్లో బోర్ కొడుతోంది..అందుకే ఇలా

వెంటనే బత్తిని హరినాథ్ గౌడ్ అతని కుమారుడు జూబ్లీహిల్స్ పీఎస్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బత్తిని ఫేక్ ముఠాను పట్టుకుని వారు అమ్ముతున్నకోవిడ్ ఆయుర్వేద చూర్ణాన్ని ల్యాబ్ టెస్టులకు పంపారు. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు పోలీసులు. రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చూర్ణాలు, హోమియో మెడిసిన్లు అంటూ ఆన్ లైన్ లో అమ్మేవాటికి ప్రాధాన్యమివ్వకపోవడమే మంచిదన్నారు. ఫేక్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న జూబ్లిహిల్స్ ఇన్ స్పెక్టర్ సత్తయ్య, ఏసీపీ శ్రీనివాస్ లను అభినందించారు.

Also Read : పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా..72 మంది స్వీయ నిర్బంధంలోకి

Next Story
Share it