పవన్ కల్యాణ్ లో ఆ విషయం చూసే వరుణ్ స్ఫూర్తిపొందాడట..!

By రాణి  Published on  16 April 2020 4:05 PM GMT
పవన్ కల్యాణ్ లో ఆ విషయం చూసే వరుణ్ స్ఫూర్తిపొందాడట..!

టాలీవుడ్ ఆరడుగుల ఆజానుబాహుడు. మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మరో తేజం..వరుణ్ తేజ్ గురువారం ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ చేశారు. #Askvarun పేరుతో నెటిజన్లడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అలా నెటిజన్లడిగిన ప్రశ్నలకు వరుణ్ ఆసక్తిగా, కాస్త ఫన్నీగా, కొన్ని పంచులేస్తూ జవాబిచ్చారు.

నెటిజన్ : మీరు పవన్ కల్యాణ్ సినిమాల్లో ఎక్కువగా చూసిన సినిమా ?

వరుణ్ : తమ్ముడు

నెటిజన్ : ఏ రకమైన సినిమాలంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతారు ?

వరుణ్ : యాక్షన్ మూవీస్

నెటిజన్ : సూపర్ హీరో పాత్రలను పోషించాలంటే ఎవరి పాత్రను పోషిస్తారు ?

వరుణ్ : బ్యాట్ మెన్

నెటిజన్ : చిరంజీవి గారి గురించి ఒక్కమాటలో ఏం చెప్తారు ?

వరుణ్ : అందరికీ ఆయనిచ్చే ప్రోత్సాహం నాకెంతో నచ్చుతుంది.

Varuntej With Chiranjeevi

నెటిజన్ : చరణ్ గురించి చెప్పాలంటే ?

వరుణ్ : భాయ్

నెటిజన్ : గుర్రం స్వారీ చేసే ఆసక్తి ఉందా ?

వరుణ్ : ఎప్పుడో చరణ్ అన్నతో కలిసి ప్రాక్టీస్ చేశాను. అప్పుడు గుర్రంపై నుంచి పడిపోయాను. మళ్లీ దాని జోలికెళ్లలేదు.

నెటిజన్ : మీ అమ్మ నాన్న ల్లో ఎవరంటే ఎక్కువ భయం ?

వరుణ్ : నో డౌట్..నాన్నే

నెటిజన్ : ఇప్పుడేం చేస్తున్నారు ?

వరుణ్ : అన్ని ట్వీట్లకు రిప్లైలు ఇచ్చేందుకు కష్టపడుతున్నా..

నెటిజన్ : మీరు పవన్ తో సినిమా చేస్తే చాలా బాగుంటుంది..

వరుణ్ : అవును..ఆ అవకాశమొస్తే మొదట సంతోషించేది నేనే..

నెటిజన్ : పవన్ లో ఏం చూసి మీరు స్ఫూర్తి పొందారు ?

వరుణ్ : ఆయన నిజాయితీ

నెటిజన్ : మీరు కొన్న వస్తువుల్లో అతి విలువైంది ?

వరుణ్ : స్నూకర్ టేబుల్. ప్రస్తుతానికి అదే చాలా విలువైన వస్తువు అనిపిస్తుంది నాకు.

నెటిజన్ : మీ ప్రొఫైల్ బ్యాక్ గ్రౌండ్ ఫొటో గురించి ఒక్కమాట ?

వరుణ్ : వాళ్లే నా బలం. నాన్న 60వ పుట్టినరోజు వేడుక సందర్భంగా తీసింది.

Varun Tej Twitter Profile

నెటిజన్ : ఏ దేశానికి ఎక్కువగా వెళ్తుంటారు ?

వరుణ్ : లండన్

నెటిజన్ : తర్వాతి సినిమా కోసం ఆఫీస్ లోనే లాక్ డౌన్ అయ్యారు..మీకెలా అనిపిస్తోంది?

వరుణ్ : నాతో పాటు నా బాక్సర్ ట్రైనర్ కూడా ఉన్నాడు.

నెటిజన్ : క్వారంటైన్ లో ఎలా ఎంటర్టైన్ అవుతున్నారు ?

వరుణ్ : సినిమాలు, టీవీ షో లు

హరీష్ శంకర్ : మీ లాస్ట్ క్రష్ ఎవరు ?

వరుణ్ : నా ఆఖరిగా విడుదలైన సినిమా గద్దలకొండ గణేష్ డైరెక్టర్ హరీష్ శంకర్

నెటిజన్ : బాలీవుడ్ అభిమాన హీరో ?

వరుణ్ : షారుఖ్ ఖాన్

నెటిజన్ : సాయిధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ ?

వరుణ్ : చేస్తాను. అందుకే మంచి విభిన్నమైన ఆసక్తికర కథ కోసం వెయిటింగ్

Varun With Sai Dharam

నెటిజన్ : గద్దలకొండ గణేష్ లో నటించిన అధర్వ గురించి ఒక్కమాట ?

వరుణ్ : స్వీట్ హార్ట్

నెటిజన్ : ఎఫ్ 3 సినిమా ఎప్పుడు ?

వరుణ్ : త్వరలోనే..

నెటిజన్ : నెగిటివ్ ట్వీట్స్ అండ్ ట్రోల్స్ పై మీ అభిప్రాయం ?

వరుణ్ : పెద్దగా పట్టించుకోను.Next Story
Share it