స‌మంత 'విల‌న్' పాత్ర పోషిస్తుందా..? ఇంత‌కీ ఏ సినిమాలో..?

By Medi Samrat  Published on  12 Oct 2019 9:23 AM GMT
స‌మంత విల‌న్ పాత్ర పోషిస్తుందా..? ఇంత‌కీ ఏ సినిమాలో..?

మ‌జిలీ, ఓ.. బేబి చిత్రాల‌తో వ‌రుస‌గ విజ‌యాలు సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన స‌మంత త‌దుప‌రి చిత్రం ఏంటి అనేది ఇప్ప‌టి వ‌ర‌కు ఎనౌన్స్ చేయ‌లేదు. పెళ్లి త‌ర్వాత స‌మంత కెరీర్ లో మ‌రింత స్పీడు పెంచింది కానీ.. ఏ సినిమా ప‌డితే ఆ సినిమా చేయ‌డం లేదు. న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న పాత్ర‌ల‌నే ఎంచుకుంటుంది. దీంతో వరుస విజయాలతో పాటు నటిగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది.

అయితే... స‌మంత గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... స‌మంత నెగిటివ్ రోల్ చేస్తుంద‌ట‌. హీరోయిన్ గా ఎన్నో స‌క్స‌స్ ఫుల్ మూవీస్ లో న‌టించిన స‌మంత నెగిటివ్ రోల్ చేయ‌నుందా..? ఇంత‌కీ.. ఏ సినిమాలో..? అస‌లు ఇది నిజ‌మేనా..? అంటూ ఆరా తీస్తున్నారు. అయితే... అది వెండితెర పై కాదు.. డిజిటల్ స్క్రీన్‌పై అని తెలిసింది. అమెజాన్ ప్రైమ్‌లో సూపర్ హిట్ అయిన తెలుగు వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్.

ఈ సిరీస్ రెండో సీజన్‌లో సమంత న‌టిస్తుంది. ఇందులో ఆమె విలన్ పాత్రలో నటిస్తోందట. టెర్రరిస్ట్‌గా కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే... ఈ వెబ్ సిరీస్‌కు మరింత క్రేజ్ రావ‌డం ఖాయం.

Next Story
Share it