బయో ఎంజైమ్స్ గురించి ఫాలోవర్లకు తెలియజేస్తున్న సమంత..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2020 9:11 AM GMT
బయో ఎంజైమ్స్ గురించి ఫాలోవర్లకు తెలియజేస్తున్న సమంత..!

సమంత ఈ మధ్య కాలంలో తన ఇంటిలోనే సొంతంగా పంట పండించడం, చెఫ్ గా మారడం వంటివి తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. ఈ మధ్యనే సమంత బయో ఎంజైమ్స్ ను తయారుచేయడం నేర్చుకుంది. ఆ విషయాన్ని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ఎలా తయారు చేస్తారో కూడా తెలిపింది.

తయారు చేసేది ఎలా..?

మూడు వంతుల నిమ్మ లేదా దబ్బ ముక్కలు (300 గ్రాములు), ఒక వంతు బెల్లం (100 గ్రాములు),10 వంతుల నీళ్లు (1 లీటర్), ఒక వంతు యీస్ట్. వీటన్నింటినీ బాగా కలిపి ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో కిచెన్‌లోని వెలుతురు లేని ప్రాంతంలో పెట్టాలి. మొదటి 10 రోజులు రోజుకి ఒకసారి కొన్ని సెకన్ల పాటు మూతను తెరిచి ఉంచాలి. ఆ తరవాత నుంచి రోజు తప్పించి రోజు ఇలా చేయాలి. మూడు నెలలు/ఒక నెల తరవాత ఈ మిశ్రమాన్ని బాగా పిండి వడకట్టాలి. మిగిలిన పిప్పిని మళ్లీ బ్లెండ్ చేసి మొండి మరకలు పోగొట్టడానికి వాడొచ్చు. వడకట్టిన మిశ్రమాన్ని వెంటనే వాడుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాము.

ఇంతకూ సమంత బయో ఎంజైమ్ ల గురించి అందరికీ తెలియజేయడానికి కారణమేమిటో తెలుసా..?

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవాల్సిన పరిస్థితి. చేతులను, శరీరాన్నే కాదు.. ఇంటిని, ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకోసం మార్కెట్ లో దొరికే ఎన్నో పదార్థాలను మనం తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ చాలా వరకూ కెమికల్స్ తో తయారుచేసి ఉంటారు. వాటికి ప్రత్యామ్నాయంగా ఈ బయో ఎంజైమ్స్ ను వాడుతారు.

బయో ఎంజైమ్స్ ను నిమ్మకాయ, దబ్బకాయ ముక్కలను పులియబెట్టి తయారుచేస్తారు. ఫ్లోర్ క్లీనర్స్‌గా, బాత్‌రూమ్ క్లీనర్స్‌గా, గ్లాస్ క్లీనర్స్‌గా, పాత్రలు శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి ఇవి ఉపయోగపడతాయి. బయో ఎంజైమ్స్‌లో ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉంటుంది. ఇళ్లలోని డ్రైన్ పైపులను బాగా శుభ్రం చేస్తాయి. సుమారుగా 1 లీటర్ బయోఎంజైమ్ 1000 లీటర్ల నీటిని శుభ్రం చేయగలదని చెబుతారు.

Next Story