ఎమోషనల్‌ అయిన సామ్‌.. ఎందుకో తెలుసా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Oct 2019 12:30 PM GMT
ఎమోషనల్‌ అయిన సామ్‌.. ఎందుకో తెలుసా?

సమంత అక్కినేనికి సోషల్‌ మీడియాలో ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది తమిళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన '96' మూవీ తెలుగులో రీమేక్‌లో సమంత నటించింది. '96' మూవీకి సంబంధించి చిత్రీకరణ పూర్తయ్యింది. అయితే దీనికి సంబంధించిన విషయాన్ని సమంత సోషల్‌ మీడియాలో తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాను నన్ను నేను బెటర్ చేసుకునేలా ఛాలెంజ్ చేసిన క్యారెక్టర్ అని అన్నారు. సినిమాలోని ఓ స్టిల్‌ను సమంతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తమిళంలో డైరెక్ట్ చేసిన జి.ప్రేమ్‌ కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Next Story
Share it