అనుష్క ఫోటోపై సమంత కామెంట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2020 11:24 AM GMT
అనుష్క ఫోటోపై సమంత కామెంట్‌

విరుష్క జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉండగా.. గర్భవతి అయిన అనుష్క హాయిగా రిలాక్స్‌ అవుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా మ‌రో ఫొటోని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. చిరున‌వ్వులు చిందిస్తూ బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ షూల్‌లో నిల‌బ‌డి చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటోని మంగళవారం షేర్‌ చేసింది.

‘మీ జీవితంలో ఇప్పటికే కలిగి ఉన్న మంచిని అంగీకరించడం సమృద్ధికి పునాది. నా మంచిని కోరుతూ.. దయ చూపుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ తెలిపింది. తనకు దయ చూపిన, ఈ ప్రపంచంలోని మంచితనాన్ని విశ్వసించేలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పింది. ఇదే తన హృదయాన్ని తెరచిందని, బ్రాడ్‌గా మార్చిందని పేర్కొంది. ఇదే అందరి ఇంట్లోనూ ఉంటుందని, ఉండాలని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బేబీ బంప్‌తో, బ్లాక్ స్విమ్ సూట్‌లో అనుష్క 'దేవత'లా ఉందని టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత ట్వీట్‌ చేసింది. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్కకు సెలబ్రిటీలే కాదు ఎంతో మంది సామాన్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story