కరోనాతో ప్రముఖ నటి ఆశాలత వబ్‌గాంకర్ కన్నుమూత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2020 6:48 AM GMT
కరోనాతో ప్రముఖ నటి ఆశాలత వబ్‌గాంకర్ కన్నుమూత

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారి వీరు వారు అనే తేడాలేకుండా అందరికి సోకుతోంది. ఇప్పటికే కరోనా కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా కారణంగా సీనియర్‌ బాలీవుడ్‌, మరాఠీ నటిమణి ఆశాలత వబ్‌గాంకర్‌ కన్నుమూశారు. కొద్ది రోజులు క్రితం ఆమెకు కరోనా సోకడంతో.. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. సతారాలోని ప్రతిభ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడించారు. ఆమె వయసు 83 సంవత్సరాలు.

కొంకొణి, హిందీ మరాఠీ సినిమాలు కలిపి దాదాపు 100కు పై సినిమాల్లో నటించారు. మరాఠీ రంగస్థల నటిగా ఫేమసైన ఆమె ముందుగా కొంకణీ సినిమాలో నటించారు. ఆ తర్వాత మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. మరాఠీలో చేస్తోన్న 'ఆయి మజి కలు బాయి' టీవీ షో చేస్తుండగా ఆమెకు వారం క్రితం కరోనా వైరస్ సోకిందని తెలుస్తుంది. వారం రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్న ఆశాలత గత మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆశాలత మృతికి పలువురు సంతాపం తెలిపారు.

Next Story