ఆస్కార్ బ‌రిలో ప్రియాంక చోప్రా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Sep 2020 9:15 AM GMT
ఆస్కార్ బ‌రిలో ప్రియాంక చోప్రా..?

బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్లిన‌ ప్రియాంక చోప్రా.. ఎన్నో అవార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. తాజాగా ప్రియాంక ఆస్కార్ బ‌రిలో నిల‌వ‌నుంద‌నే వార్తలు వ‌స్తున్నాయి. గతంలో ఆస్కార్ వేడుకలకు అతిథిగా వెళ్లిన ప్రియాంక.. ఇప్పుడు ఆస్కార్ అవార్డునే ఇంటికి తీసుకురానుంద‌ని అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు.

వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్‌ వేడుకలో 'ది వైట్‌ టైగర్' తరఫున ప్రియాంక నామినేట్ కాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా త‌రుపున‌ ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక చోటు దక్కించుకునే అవకాశం ఉందని హాలీవుడ్‌లో జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి‌.

ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక‌.. హాలీవుడ్‌ స్టార్స్‌ మెరిల్‌ స్ట్రీప్, నటాషా లయాన్, మారే విన్నింగ్‌హామ్ తదితర నటీమణులతో పోటీ పడనున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. రాజ్ కుమార్ రావ్‌, ప్రియాంక చోప్రా న‌టించిన‌ 'ది వైట్‌ టైగర్స ఇంకా విడుదల కాలేదు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోందని తెలుస్తోంది. మరి ప్రియాంక చోప్రా ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందో? లేదో తెలియాలంటే.. వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ ఆగాల్సిందే.

Next Story