కీరవాణికి అరుదైన వ్యాధి

By సుభాష్  Published on  22 Sep 2020 9:21 AM GMT
కీరవాణికి అరుదైన వ్యాధి

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. 200 సినిమాలకుపైగా కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికీ రాజమౌళి సినిమాలతో తన సత్తా చూపిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీలో కూడా కీరవాణికి మంచి పేరు ఉంది. ఇప్పుడు ఈయన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధే ఎంఎస్‌ (మల్టీపుల్‌ సెలిరోసిన్) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా కీరవాణి ఓ వీడియో ద్వారా తెలిపాడు.

గత కొన్ని రోజులుగా ఈ వ్యాధితో బాధపడుతున్నానని, ఇది కేవలం ఈ వయసు వాళ్లకే వస్తుందని లేదని, ఎప్పుడైనా ఏ వయసు వారికైనా రావచ్చని తెలిపాడు.ఈ వ్యాధి మెదడుకు శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యాధిపై ఎంఎస్‌ ఇండియా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వానికి తన గళాన్ని వినిపిస్తుందని చెప్పుకొచ్చారు కీరవాణి. మల్టీపుల్‌ సెలిరోసిన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారంతా ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ వ్యాధి వారు యోగా, సంగీతం వంటి వాటితో కాస్త ఉపశమనం పొందవచ్చని కీరవాణి అన్నారు.Next Story