ధోనీ కాళ్లు నొక్కిన సాక్షి
By తోట వంశీ కుమార్ Published on 20 April 2020 8:21 AM GMTకరోనా వైరస్ దెబ్బకి క్రీడా రంగం కుదేలైంది. కరోనా వ్యాప్తని అరికట్టడానికి చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. కరోనా ముప్పుతో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో భారత క్రికెటర్లు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అనుకోకుండా లభించిన ఈ విరామాన్ని తమ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నారు.
ఇక ఐపీఎల్ సత్తా చాటి రీ ఎంట్రీ ఘనంగా ఇవ్వాలని బావించాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అందుకు తగ్గట్లుగానే నెల రోజుల ముందుగానే చెన్నై చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఐపీఎల్ వాయిదా పడడంతో రాంచీలోని తన ఫామ్ వెళ్లి.. ఈ లాక్‌డౌన్ కాలన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
లాక్‌డౌన్ కాలంలో ధోని చేసే పనులను అతని భార్య సాక్షిసింగ్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటి కప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది. పతియే ప్రత్యక్ష దైవం అని చాటి చెప్పిన సన్నివేశమది. ధోని మొత్తటి పరుపుపై సేద తీరుతుంటే చటుక్కన సాక్షి ధోని కాళ్లను ఒడిలో వేసుకుని నొక్కుతోంది. ధోనీ ని మిస్టర్ స్వీటీ! అని సంబోధిస్తూ మిస్టర్ స్వీటీ అటెన్షన్ కోసం అంటూ ఆ ఫోటో కింద రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.