భార్య‌తో డ్యాన్స్.. కూతురితో బాక్సింగ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2020 6:36 AM GMT
భార్య‌తో డ్యాన్స్.. కూతురితో బాక్సింగ్‌

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల చాలా క్రీడ‌లు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని క్రీడ‌లు ర‌ద్దు అయ్యాయి. ఇక ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించ‌డానికి చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. దీంతో క్రీడాక‌రులంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. క‌రోనా సెల‌వుల‌ను కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతూ.. హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.

చాలా మంది క్రీడాకారులు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. లాక్‌డౌన్ కాలంలో తాము చేసే ప‌నుల‌ను సోష‌ల్ మీడియాలో అనుమానుల‌తో పంచుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ బాక్సింగ్ కోచ్ అవ‌తారం ఎత్తాడు. త‌న కుమారైకు బాక్సింగ్ శిక్ష‌ణ ఇస్తున్నాడు ఈ స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్‌. ఆదివారం త‌న ఇన్‌స్టాగ్రామ్ లో త‌న కుమారైకు బాక్సింగ్ నేర్పిస్తున్న వీడియోను అభిమానుల‌తో పంచుకున్నాడు. బాక్సింగ్ ట్రైనింగ్ ను ఆస్వాదిస్తున్నాను అని ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. ఇక త‌న భార్య కాండిస్ క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోను కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఇటీవ‌లే టిక్‌టాక్ లో చేరిన వార్న‌ర్ బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ హిట్ సాంగ్ షీలాకీ జ‌వాని పాట‌కు స్టెప్పుల‌తో వార్న‌ర్ అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it