అమెరికాలో సై అంటోన్న 'సైరా' వసూళ్లు...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 4:43 PM GMT
అమెరికాలో సై అంటోన్న సైరా వసూళ్లు...!

మెగస్టార్ చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహరెడ్డి'. విడుదలైన మొదటి షో నుంచే రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది. అమెరికాలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అత్యధిక వసూళ్లు రాబడుతుంది. అమెరికాలో సైరా చిత్రం ఇప్పటి వరకు దాదాపు 3 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. దీనిపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.250 కోట్లు రాబట్టిందని టాలీవుడ్ టాక్‌. విడుదలైన అన్ని భాషాల్లోనూ సైరా దూసుకుపోతుండటంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉన్నారు.1847 నాటి స్వాతంత్ర్య సమరయూధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి రియల్ స్టోరీతో తెరకిక్కిన చిత్రం సైరా నరసింహరెడ్డి. రూ. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Next Story
Share it