క్రేజీ రూమ‌ర్.. చిరు చెల్లెలిగా సాయిప‌ల్ల‌వి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sept 2020 8:48 AM IST
క్రేజీ రూమ‌ర్.. చిరు చెల్లెలిగా సాయిప‌ల్ల‌వి

ఈ మ‌ధ్యే మెగాస్టార్ చిరంజీవి గుండు చేయించుకుని కొత్త లుక్‌లోకి మారారు. ఇది త‌మిళ హిట్ వేదాలం రీమేక్ కోసం చిరు ఎత్తిన కొత్త అవ‌తారం అంటున్నారు. ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఒరిజిన‌ల్ అన్న‌-చెల్లెలి సెంటిమెంట్ నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌. వారి మ‌ధ్య ర‌క్త సంబంధం ఉండ‌దు. కానీ అన్నా చెల్లెళ్లలా మెలుగుతుంటారు. సినిమాలో హీరోయిన్ కంటే హీరో చెల్లెలి పాత్ర‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆ పాత్ర చుట్టూనే క‌థ న‌డుస్తుంది. త‌మిళంలో ఈ పాత్ర‌ను ల‌క్ష్మీ మేన‌న్ చేసింది. ఆమెకు మంచి పేరు తెచ్చిన పాత్ర అది. తెలుగులో ఈ పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి పేరును ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

పాత్ర ప్రాధాన్యం దృష్ట్యా పేరున్న న‌టే చేయాలి. అలాగని గ్లామ‌ర్ హీరోయిన్ల‌ను పెడితే వ‌ర్క‌వుట్ కాదు. అందుకే సాయిప‌ల్ల‌వి లాంటి పెర్ఫామ‌ర్‌ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. చెల్లెలిగా అయినా స‌రే.. చిరు సినిమాలో న‌టించ‌డానికి సాయిప‌ల్ల‌వి వెనుకాడ‌క‌పోవ‌చ్చు. తిరుగులేని పెర్ఫామ‌ర్ అయిన సాయిప‌ల్ల‌వి చిరుకు చెల్లెలిగా న‌టిస్తే సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి నిజంగా ఆమెను సంప్ర‌దించారా.. పాత్ర‌ల విష‌యంలో ఆచితూచి అడుగులేసే సాయిప‌ల్ల‌వి ఈ సినిమాకు ఓకే చెప్పిందా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఆచార్య‌లో న‌టిస్తున్న చిరు.. ఇప్ప‌టికే లూసిఫ‌ర్ రీమేక్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. దీంతో పాటు మెహ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాలం రీమేక్‌లోనూ న‌టించ‌డానికి రెడీ అయ్యాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Next Story