టీడీపీకి మరో షాక్‌ ! సాదినేని యామిని గుడ్‌ బై !?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 7:52 AM GMT
టీడీపీకి మరో షాక్‌ ! సాదినేని యామిని గుడ్‌ బై !?

ముఖ్యాంశాలు

  • టీడీపీకి సాదినేని యామిని గుడ్ బై?
  • బీజేపీలో చేరతారా?వైఎస్ఆర్ సీపీలో చేరుతారా?
  • యామిని పార్టీ మార్పుపై పలు రకాలు ఊహాగానాలు

టీడీపీకి మరో షాక్‌. అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె సైలెంట్‌ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆరు నెలల నుంచి ఆమె టీడీపీ ఆఫీసు వైపు రావడం లేదు.

ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి కూడా యామిని రాలేదు. టీడీపీ తరపున వాయిస్‌ వినిపించడం లేదు. దీంతో ఆమె కండువా మార్చబోతున్నారని తెలుస్తోంది.

టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో కొంతకాలంగా ఆమె సైలెంట్‌గా ఉంటున్నారు. మూడు నెలల కిందటే ఆమె పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. కానీ ఆమె ఎందుకో అప్పుడు బయటకు రాలేదు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

సాదినేని యామిని ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారో అనేది ఆసక్తికరంగా మారింది. ఆమె బీజేపీలోకి వెళతారా? వైసీపీలో చేరుతారా? అనే చర్చ నడుస్తోంది. అయితే ఆమె బీజేపీకిలో వెళ్లే అవకాశాలు ఉన్నాయని అమరావతి మీడియా వర్గాల సమాచారం.

అయితే ఏ పార్టీలోకి వెళతారనే విషయంపై ఇంకా ఆమె క్లారిటీ ఇవ్వలేదు. పార్టీకి ఆమె రాజీనామా చేయడం మాత్రం ఖాయమైంది. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తారని తెలుస్తోంది.

Next Story
Share it