ఇద్దరు సాధువుల దారుణ హత్య

By సుభాష్  Published on  24 May 2020 11:37 AM GMT
ఇద్దరు సాధువుల దారుణ హత్య

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. నాందేడ్‌లో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని దుండుగులు దారుణంగా హతమార్చారు. బాలబ్రహ్మచారి శివచారర్యను, ఆయన శిశుడుగా భావిస్తున్న భగవాన్‌ షిండేను ఉమ్రి తాలుకాలోని వారి ఆశ్రమంలోని బాత్‌ రూమ్‌ వద్ద వీరి మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు వివరించారు.

కాగా, ఆశ్రమంలోని వస్తువులను దుండగులు దోపిడి చేసేందుకు వచ్చి వారిని ఎదురించబోయిన సాధువుల గొంతునులిపి హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దుండగులు ఆశ్రమం నుంచి లక్షన్నవిలువైన వస్తువులను దొంగిలించడమే కాకుండా శివాచార్య కారు తాళాలను సైతం లాక్కున్నారని తెలిపారు. అయితే దోపిడి చేసిన వస్తువుల్లో 69వేల విలువైన లాప్‌టాప్‌ కూడా ఉందన్నారు. సాధువుకు చెందిన కారులోనే దుండగులు పారిపోతుండగా, ఆశ్రమ గేటు వద్ద కారు ఆగిపోవడంతో, కారు దిగి ద్విచక్రవాహనంపై పారరయ్యారని పోలీసులు గుర్తించారు.

కాగా, ఈ కేసుకు సంబంధించిన సాయినాథ్ శింగాఏ అనేవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కొందరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. కర్ణాటకకు చెందిన శివాచార్య కొన్నేళ్లుగా నాందేడ్‌లోనే ఉంటున్నారు. అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంత అభివృద్దికి ఎంతో తోడ్పడుతున్నట్లు తెలుస్తోంది. పాల్గర్‌ జిల్లాలో ఇద్దరు సాధువులను స్థానికులు దారుణంగా కర్రలతో కొట్టి, బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన మరువక ముందు మరో ఇద్దరి సాధువులను హతమార్చడం తీవ్ర సంచలనం రేపుతోంది.

Next Story