శాక్రిఫైజ్‌ స్టార్ సునిశిత్‌ అరెస్ట్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 7:28 PM IST
శాక్రిఫైజ్‌ స్టార్ సునిశిత్‌ అరెస్ట్‌

శాక్రిఫైజ్‌ స్టార్ సునిశిత్‌ గుర్తున్నాడా..! అదేనండి కరోనా రాకముందు య్యూటాబ్‌లో ఇతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఫలానా సినిమాల్లో తానే హీరోగా చేయాల్సిందని, తాను త్యాగం చేస్తేనే ఎన్నో సినిమాల్లో మహేష్‌బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్‌ హీరోలు చేసి వాళ్లు స్టార్లుగా ఎదిగారని, ప్రముఖ హీరోయిన్లు తన లవర్స్‌ అంటూ హంగామా చేసిన సునిశిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

వివిధ యూట్యూబ్‌ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ల్లో సునిశిత్‌ హద్దు మీరి మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు తనకు తెలుసని, వాళ్లు తనను ప్రేమించారని, పెళ్లి పీటల వరకూ వెళ్లి వెనక్కి తగ్గారని సునిశిత్ చెప్పేవాడు. అసభ్య పదజాలంతో వారిని దూషించాడు. ఈ క్రమంలోనే సునిశిత్‌పై ఇబ్రహీంపట్నం, కీసర పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కీసర పోలీసులు తాజాగా సునిశిత్‌ అరెస్ట్‌ చేశారు.

కాగా, తనపై అసత్య ప్రచారం చేస్తున్న సునిశిత్‌పై గతంలో హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెయిల్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story