'స్క్వేర్ కట్స్ ఆడడం నుంచి హెయిర్ కట్స్ వరకు'
By తోట వంశీ కుమార్ Published on 19 April 2020 5:05 PM GMTకరోనా వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం లాక్‌డౌన్ ను విధించింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్‌డౌన్ కాలాన్ని క్రీడాకారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తాము లాక్‌డౌన్ కాలంలో చేసే పనులను అభిమానులతో పంచుకుంటున్నారు భారత క్రికెటర్లు.
తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్టు చేశాడు. తన జట్టును తానే కత్తిరించుకున్నానని అది ఎలా ఉందో చెప్పాలని అభిమానులను కోరాడు. స్వ్కేర్ కట్స్ ఆడటం నుంచి నా హెయిర్ కట్స్ చేస్తున్నా. భిన్నంగా చేసే ప్రతి దానిని ఆస్వాదిస్తున్నా. నా కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది..? అని ఆ ఫోటో కింద రాసుకొచ్చాడు.
Next Story