‘సామ్నా’ చీఫ్‌ ఎడిటర్‌గా మహారాష్ట్ర సీఎం భార్య

By అంజి  Published on  2 March 2020 3:59 AM GMT
‘సామ్నా’ చీఫ్‌ ఎడిటర్‌గా మహారాష్ట్ర సీఎం భార్య

ముఖ్యాంశాలు

  • సామ్నా సంపాదకురాలిగా రష్మీ ఠాక్రే
  • ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ హోదాలో సంజయ్‌ రౌత్‌
  • జననరి 23, 1988న సామ్నా పత్రికను ప్రారంభించిన బాల్‌ ఠాక్రే

ముంబై: శివసేన పార్టీ అధికార దినపత్రిక 'సామ్నా' ప్రధాన సంపాదకురాలిగా రష్మీ ఠాక్రే బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఉద్దవ్‌ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే. ఉద్దవ్‌ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి సామ్నా దినపత్రిక బాధ్యతలను సంజయ్‌ రౌత్‌ నిర్వహించారు. ఆయన ఇప్పుడు సామ్నాకు ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా కొనసాగుతారని ఆదివారం సామ్నా దినపత్రిక సంచికలో ప్రకటించారు.

సామ్నాకు చీఫ్‌ ఎడిటర్‌ ఎందుకు నియమించలేదంటూ సంజయ్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామ్నా పత్రిక శివసేనకు కాకుండా, ఠాక్రే కుటుంబానికి మౌత్‌పీస్‌గా మారిందని కొందరు విమర్శిస్తున్నారు. అంతకుముందు ఉద్దవ్‌ ఠాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేసే వరకు సామ్నా పత్రిక సంపాదకుడిగా కొనసాగారు. 1988 జనవరి 23న సామ్నా పత్రికను దివంగత బాల్‌ఠాక్రే ప్రారంభించారు.

2012లో ఆయన మరణించేవరకు సంపాదకుడిగా కొనసాగిన బాల్‌ఠాక్రే.. అప్పటి వరకు ఆయనే మొదటి సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన మరణాంతరం ఉద్దవ్‌ఠాక్రే రెండో సంపాదుకుడిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆయన మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో.. సంపాదకుడి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. శివసేన పార్టీ తన విధానాలను, అభిప్రాయాలను సామ్నా దినపత్రిక ద్వారానే వెల్లడిస్తుంది.

Next Story