క‌రోనా.. ప్ర‌పంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మ‌హ‌మ్మారి. ఒక్క‌సారిగా రష్యాలో విశ్వరూపం దాల్చింది. కేవ‌లం ఒక్క ఆదివారం  రోజునే 10,633 కొత్త కేసులు నమోదయ్యాయ‌ని అక్క‌డి అధికార వ‌ర్గాలు తెలుపుతున్నాయి. ఇక‌ రష్యాలో ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదవడం ఇదే ప్ర‌థ‌మం.

అయితే.. ఇందులో సగానికి పైగా కేసులు ర‌ష్యా రాజ‌ధాని న‌గ‌రం మాస్కోలోనే న‌మోద‌యిట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇదిలావుంటే.. ర‌ష్యాలో గడిచిన 24 గంటల్లో 58 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో దేశవ్యాప్తంగా వైరస్ బారినప‌డి మృతిచెందిన వారి సంఖ్య 1,420కి చేరుకుంది. ఇక దేశ‌వ్యాప్తంగా న‌మోదైన‌ కేసులు 134,000 కు చేరుకుంది. అలాగే.. వైర‌స్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 16,639.
ఇక క‌రోనా విల‌య తాండ‌వం చేస్తున్న ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలతో పోలిస్తే రష్యాలో క‌రోనా మరణాల రేటు తక్కువగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, ఓ ప‌క్క‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మే 12 నుండి లాక్​డౌన్‌కు జోన్‌ల లెక్క‌న‌ సడలింపులు ఇవ్వనున్నట్లు అక్క‌డి ప్ర‌భుత్వ వ‌ర్గాలు అంటున్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *