‘రూల‌ర్‌’ న్యూ లుక్ రిలీజ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Nov 2019 5:29 AM GMT
‘రూల‌ర్‌’ న్యూ లుక్ రిలీజ్..!

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం ‘రూల‌ర్‌’. సి.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నారు. రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాల‌కృష్ణ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన విషయం తెలిసిందే.

వీటికి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే చిత్ర యూనిట్ షూటింగ్ అప్‌డేట్ తెలియజేస్తూ.. మరో కొత్త లుక్‌ను విడుద‌ల చేసింది.‘గోల్ఫ్’ స్టిక్‌తో బాలయ్య ఉన్న ఈ లుక్‌ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. ‘రూల‌ర్‌’ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్నారు.

ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మయ్యాయి. ‘జైసింహా’ వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Next Story