యువ‌ హీరో సందీప్ కిషన్, హన్సిక మోత్వాని జంట‌గా రూపొందిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి.ఎ బి.ఎల్’. ఈ చిత్రానికి జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం నవంబర్15న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానుల సమక్షంలో బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు చిత్ర యూనిట్. అనంతరం సక్సెస్ కేక్ ను కట్ చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ..
మా సినిమాకు వచ్చి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులందరికి థాంక్స్. కేవ‌లం నవ్వించడానికే మేము ఈ సినిమా తీశామన్నారు. ఇప్పుడు థియేట‌ర్స్‌లో ఆడియన్స్ అదే చేస్తున్నారన్నారు. సినిమాలో కామెడీ ఉంది, మ్యూజిక్ బాగుంది, ట్విస్ట్ లు బాగున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. మాకు అదే చాలు అని అన్నారు. సినిమా రెస్పాన్స్ చాలా బాగుందని తెలిపారు. నా సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్‌కు ధన్యవాదాలు తెలియచేశారు. సినిమాకు వచ్చే రెస్పాన్స్ తో మా యూనిట్ సభ్యులు అందరూ హ్యాపీగా ఉన్నామని అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..
మా ద‌ర్శ‌కుడు జి. నాగేశ్వ‌ర‌రెడ్డి చెప్పిన‌ట్టు మేము ఈ సినిమా నవ్వించానికి తీశామని.. ముందు నుంచే చెబుతూ వస్తున్నామన్నారు. రివ్యూస్ ను స్వాగతిస్తున్నాను అన్నారు. అలాగే తనకు వచ్చే కాల్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఆడియన్స్ ను నవ్విస్తుందని. ఎక్క‌డా బోర్ కొట్టకుండా సినిమా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ప్రతి షోకు జనాలు పెరుగుతున్నారని అన్నారు. ఆ విషయం మమ్మల్ని సంతోష పెట్టిందన్నారు. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ప్రేత్యేక ధన్యవాదాలు, ఆడియన్స్ ఈ సినిమాలో చాలా ఎపిసోడ్స్ లో నవ్వుతున్నారు. అయితే ఆ వీడియోస్ తీసి నాకు పంప‌మ‌ని చెప్పాను. త్వ‌ర‌లోనే వాటిని సోష‌ల్‌మీడియాలో మీతో పంచుకుంటాను అని అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.