ముఖ్యాంశాలు

  • కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
  • 40 రోజులు ఆర్టీసీ సమ్మె జరగడం ఇదే మొదటి సారి: జగ్గారెడ్డి

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం.. ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవు అని సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో మాట్లాడరని.. ఇప్పుడు అందుకు విభిన్నంగా పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు. రైతుల ఆత్మహత్యలు ఒకవైపు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు మరోవైపు.. 40 రోజులు ఆర్టీసీ సమ్మె జరగడం ఇదే మొదటి సారి అని జగ్గారెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఇంకా ఎన్ని రోజులు సమ్మె జరుగుతుందో తెలియడం లేదు.

ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి సమస్య పరిష్కారం కావడం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇంత మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఉద్యమాలకు రాష్ట్రంలో విలువలేకుండా పోయిందని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కళ్లుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇది అని అన్నారు. చనిపోయిన కార్మికులను ఎవరు ఆదుకోవాలి. ఈ పోరాటం బలహీనుడికి బలవంతుడికి మధ్య జరుగుతున్నదని.. భగవంతుడు ఎవరిని గెలిపిస్తోడో చూడాలన్నారు. కొందరు నాయకులు ప్రభుత్వానికి చెంచా గిరి చేసుకుంటూ బతుకుతున్నారని, కేవలం సీఎం కేసీఆర్‌ మాటలను బలపరుస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.