ఆర్టీసీ సమ్మె: ఆప్ట్రాల్ గవర్నమెంట్ అన్న హైకోర్ట్..!!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 15 Oct 2019 5:29 PM IST

హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ సమ్మెపై కోర్ట్ సీరియస్ అయింది. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని ఆదేశించింది. ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికిప్పుడే చర్చలు స్టార్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండ్రోజుల్లో కార్మికులతో చర్చలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఇగోలకు పోవడం వలన సమస్య పరిష్కారం కాదు..సర్కార్ ఒక మెట్టు దిగాలని ఆదేశించింది. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని హైకోర్ట్ విజ్ఞప్తి చేసింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. స్కూళ్ల సెలవులు, ఉద్యోగుల జీతాల పిటీషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్ట్.
ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించేదిలేదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్తామన్నారు.
Next Story