ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చట్టబద్దం - కాంగ్రెస్‌ సీనియర్ నేత కుంతియా

By Newsmeter.Network  Published on  9 Oct 2019 1:46 PM GMT
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చట్టబద్దం - కాంగ్రెస్‌ సీనియర్ నేత కుంతియా

హైదరాబాద్‌ : ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు అక్రమం అంటూ మండిపడ్డారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ సీ కుంతియా. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చట్టబద్దమేనని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ వెంటనే ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 50వేల మంది ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినహామీలను నెరవేర్చాలన్నారు కుంతియా. ప్రభుత్వం మొండి వైఖరి ప్రజలకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. సమస్యలు పరిష్కరించి ఆర్టీసీ ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కుంతియా.

కేటీఆర్‌ అంటే కల్వకుంట్ల ట్విటర్‌ రావు - పొన్నం

కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కంటే కల్వకుంట్ల ట్విటర్ రావు గా బాగా ప్రచారంలోకి వచ్చిందన్నారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌. ట్విటర్‌లో ప్రతిదానిపై స్పందించే కేటీఆర్‌..ఆర్టీసీ సమ్మెపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని కేసీఆర్‌ హామీ ఇవ్వలేదా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఉద్యోగులను తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడవా అని ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేశారు. సమ్మెపై కేటీఆర్‌ స్పందించకపోతే తెలంగాణ ప్రజల దృష్టిలో ద్రోహిగా మిగులుతారన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు పొన్నం ప్రభాకర్.

Next Story
Share it