తెలంగాణ‌ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కూకట్‌పల్లి డిపోకు చెందిన కోరేటి రాజు అనే డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటూ.. వారి ఆత్మహత్యకు అశ్వత్థామరెడ్డి కారణమవుతున్నాడని డ్రైవర్ ఆరోపించాడు.

సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మాట‌లు నాకు క‌నువిప్పు క‌లిగించాయ‌ని కోరేటి రాజు అన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీల్లో జాయిన్ అయితే తమకు అభ్యంతరం లేదని.. ఇష్టమున్న వారు దరఖాస్తు పెట్టుకోవచ్చని సీఎం సూచించారని.. అందుకనుగుణంగా అందరూ విధుల్లో చేరాలని రాజు పిలుపునిచ్చారు. కార్మికుల కోసం కొట్లాడేందుకు చాలా మంది నాయకులు ఉన్నారని త‌ల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకోవాలంటే అంద‌రూ విధుల్లో చేరాల‌ని సూచించాడు.

L1

L2

L3

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.