భద్రాద్రి కొత్తగూడెం: ములకలపల్లి మండలం కొత్తగంగారంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొని కారం కన్నప్ప (50) అనే వ్యక్తి మృతిచెందాడు. కన్నప్ప పాతగంగారం నుంచి కొత్తగంగారం వెళ్తుండగా ఏలూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కన్నప్ప తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడుపుతుంటే రోడ్డు ఎక్కాలంటేనే భయంగా ఉందని.. ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వ వైఖరిని ప్రజలు తప్పుబడుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story