రూ. 68వేలకు బంగారం.. ఎప్పుడంటే..!
By సుభాష్ Published on 25 Jun 2020 9:51 AM GMTప్రస్తుతం పసిడి ధరలపైనే అందరి దృష్టి. బంగారం ధరలు ప్రతి రోజు బంగారం ప్రియులకు షాకిస్తూనే ఉన్నాయి. ఒకరోజు తగ్గితే వారం రోజులపాటు ధరలు పెడుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు అంటేనే వినియోగదారులు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నతగ్గిన బంగారం ధరలు.. ఈరోజు మళ్ళీ పెరిగాయి. ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల పసిడి ప్రయులకు టెన్షన్ పుట్టిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితులు, సంస్థల ప్రతికూల అవుట్‌లుక్ ప్రకటన లాంటి సంక్షోభ సమయాల్లో ఇన్వెస్టర్లకు ఆదాయాలను ఇచ్చే ఏకైక మార్గం అంటే అది బంగారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల వరకు చేరుకుంది. కాగా, రానున్న రోజుల్లో పసిడి ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే అంతర్జాతీయ బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్ ఉండటం, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు, దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మహమ్మారి భయం, స్థానిక పరిస్థితుల కారణంగా పసిడి ధరల్లో హెచ్చు, తగ్గులు చోటు చేటు చేసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ బంగారం ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్నబంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో 10 గ్రాముల బంగారం ధర 68వేలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కరోనా వైరస్ తగ్గినా పసిడికి డిమాండే..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినా.. బంగారానికి డిమాండే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లలో పసిడి ధర రూ.68వేల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, డాలర్ మారకంలో రూపాయి కదలికలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు మరో రెండేళ్ల సులభమైన ద్రవ్య పాలసీ విధానికే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. ఇది బలంగారం బలపడేందుకు ఎంతో దోహదం చేయవచ్చు.. అని పలువురు నిపుణులు
కరోనా మహమ్మారి వల్ల భారత ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బ తీసిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఏకంగా 4.5శాతం పడిపోయింద అంచనా వేసింది. అయితే 2021లో 6శాతం వృద్ధిరేటు నమోదవుతుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. అలాగే అంతర్జాతీయ వృద్దిరేటు 2020లో 4.9 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
తాజాగా గురువారం బంగారం ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర:
హైదరాబాద్: రూ.46,360
ఢిల్లీ: రూ. 47,060
చెన్నై : రూ. 46,360
ముంబాయి : రూ. 47,410
కోల్‌కతా : రూ.47,750
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర :
హైదరాబాద్ : 50,570
ఢిల్లీ : రూ.48,260
చెన్నై : రూ.50,570
ముంబాయి : 48,410
కోల్‌కతా : రూ.49,040