రూ.125 కాయిన్ విడుదల.. ఎవరి జ్ఞాపకంగా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 5:16 AM GMT
రూ.125 కాయిన్ విడుదల.. ఎవరి జ్ఞాపకంగా?

కేంద్ర ప్రభుత్వం మరో కాయిన్‌ను విడుదల చేసింది. ఒక యోగి ఆత్మ కథ రచయిత, యోగద సత్సంగ సొసైటీ, సెల్ఫ్‌ రియలైజేషన్‌ ఫిలోషిప్‌ వ్యవస్థాపకులు అయినా పరమహంస యోగానంద 125 జయంతిన పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ రూ.125 నాణాన్ని విడుదల చేశారు. పరమహంస యోగానంద 1893 జనవరి 8న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌లోని ఓ సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. యుక్తేశ్వరి గిరి అనే గురువు వద్ద శిక్షణ పొందారు.

పరమహంస యోగానంద తన ద్వారా క్రియా యోగాన్ని పశ్చిమ దేశాలకు అందించే బాధ్యతతో 1925లో అమెరికాలో సెల్ప్‌ రియలైజేషన్‌ ఫెలోషిప్‌ను పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. దీంతో లక్షలాది మంది అమెరికా, యూరప్ జాతీయాలు ఈయన శిష్యులుగా మారారు. యోగి గత అనుభవాలను ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో రాశాడు. అయితే ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం. అంతే కాదు ఎక్కువ మందిని ప్రభావం చేసే పుస్తకంగా కూడా నిలిచింది. యాపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌తో సహా చాలా మందికి ఆటో బయోగ్రఫీ ఆఫ్‌ యోగి పుస్తకం చాలా స్పూర్తి ఇచ్చింది. అయితే పరమహంస యోగానంద 1952లో అమెరికాలో మహాసమాధి చెందారు. అయితే ఎంతో మంది ఔత్సాహికులకు క్రియా యోగా మార్గాన్ని అందించిన యోగానంద గౌరవార్థంగా రూ.125 నాణాన్ని ఆర్థిక మంత్రి విడుదల చేశారు.

Next Story