అతివేగంతో అదుపుతప్పిన కారు.. ముగ్గురు మృతి

By Medi Samrat  Published on  11 Oct 2019 12:56 PM GMT
అతివేగంతో అదుపుతప్పిన కారు.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్‌ మండలం బూర్గుల టోల్‌గేట్‌ సమీపంలో అదుపు తప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొ్ట్టి పంట పొలాల్లో పడింది. కాగా మరో కారును ఓవర్‌ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాదు నుంచి అనంతపురం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహితుడి సోదరి వివాహానికి మారుతి ఎర్టిగా కారులో ఏడుగురు యువకులు అనంతపురం బయల్దేరారు. ఈ క్రమంలో షాద్‌నగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. TS08 GQ 4484 నెంబర్‌ గల కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది.

Next Story
Share it