108 అంబులెన్స్‌కు నిప్పంటించిన రౌడీషీటర్
By సుభాష్ Published on 16 Sep 2020 4:30 AM GMTప్రకాశం జిల్లాలో ఓ రౌడీ షీటర్ బీభత్సం సృష్టించాడు. ఒంగోలులో రౌడీషీటర్ సురేష్ 108కి తరచూ రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్ విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బుధవారం ఉదయం నరేష్ వింత వింతగా ప్రవర్తిస్తూ పోలీస్ స్టేషన్ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో అతనికి గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌ను రప్పించారు.
రౌడీషీటర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా తన వద్ద ఉన్న అగ్గిపెట్టెతో 108 అంబులెన్స్‌కు నిప్పటించాడు. ఈ ఘటనలో 108 వాహనం పూర్తిగా దగ్ధమైంది. నిందితుడు సురేష్ ఈ అగ్నిలో తాను కూడా కాలిపోతానని కేకలు వేశాడు. దీంతో పోలీసులు అతికష్టం మీద అంబులెన్స్‌లోంచి బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, సురేష్‌కు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది.