నాగబాబుకు కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  16 Sep 2020 4:05 AM GMT
నాగబాబుకు కరోనా పాజిటివ్‌

టాలీవుడ్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, టీవీ నటీనటులకు కరోనా వైరస్‌ సోకగా, తాజాగా మెగాబ్రదర్‌ నాగబాబుకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అయితే కరోనా జయించిన తర్వాత ప్లాస్మాదానం చేస్తానని నాగబాబు ట్వీట్‌ చేశారు. ఇక ఆ ట్వీట్‌ను మెగా అభిమానులు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా,గత కొన్ని రోజులుగా నాగబాబు ఓ ఛానెల్‌లో వచ్చే కామెడీ పాల్గొంటున్న విషయం తెలిసిందే.

ప్రపంచ దేశాలన్నింటికి చాపకింద నీరులా వ్యాపించిన కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు భారత్‌తో పాటు ఇతర దేశాలు సైతం కృషి చేస్తున్నాయి. పలు దేశాల వ్యాక్సిన్‌లు ట్రయల్‌ రన్‌లో ఉండగా, మరి కొన్ని మూడో దశ, చివరి దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్లు అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయి.Next Story