ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు..

By Newsmeter.Network  Published on  21 Feb 2020 10:01 AM GMT
ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు..

కివీస్‌ సీనియర్‌ ఆటగాడు రాస్ టేలర్‌ క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు టీమిండియాతో ప్రారంభమైన తొలి టెస్టు.. టేలర్‌ కెరీర్‌లో వందో టెస్టు. దీంతో టేలర్‌ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు(టెస్టులు, వన్డేలు, టీ20)ల్లో వంద మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. టేలర్‌ ఇప్పటి వరకు 231 వన్డేలు, 100టీ20ల్లో కివీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే.. టిమిండియా పై వందో టెస్టు ఆడుతున్న టేలర్‌.. భారత్‌తోనే ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో వందో టీ20 రికార్డును అందుకోవడం విశేషం.

న్యూజిలాండ్‌ తరుపున వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు టేలర్‌. వన్డేల్లో 7,174, టెస్టుల్లో 8,570 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌, మార్టిన్‌గుప్టిల్‌ లు టీ20 క్రికెట్‌లో టేలర్‌ కన్నా ఎక్కువ పరుగులు చేశారు. టీ20 క్రికెట్‌ ప్రారంభమై 15 ఏళ్లైనా.. సీనియర్‌ ఆటగాళ్లుఎ రిటైర్‌ అవ్వడంతో.. టేలర్‌ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పుడు టీ20 మ్యాచ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో భవిష్యత్‌లో చాలా మంది క్రికెటర్లు ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది.

Next Story
Share it