'రొమాంటిక్' టీమ్ క్లైమాక్స్ కి సిద్ధం !
By Newsmeter.Network Published on 11 Dec 2019 1:20 PM GMTడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి ప్రస్తుతం 'రొమాంటిక్' అనే సినిమాలో హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో రానున్న ఈ సినిమా గత నెలలో గోవాలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఈ గోవా షెడ్యూల్ లో రెండు సాంగ్స్ తో పాటు కొన్ని లవ్ సీన్స్ ను షూట్ చేశారు. కాగా సోమవారం నుండి చిత్రబృందం తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించబోతుంది. ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ ను అలాగే ఫ్యాచ్ వర్క్ కు సంబంధించిన కొన్ని షాట్స్ ను చిత్రీకరించనున్నారు. హీరోహీరోయిన్లతో పాటు మిగిలిన ప్రధాన పాత్రల కాంబినేషన్ లో నడిచే క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది.
అయితే రమ్యకృష్ణ చేస్తోన్న పాత్రలో మందిరా బేడి ఆల్ రెడీ నటించిందట. ఆమె షూటింగ్ కూడా పూర్తి చేసింది. కానీ మందిరా సీన్స్ బాగా రాకపోవడంతో చివరికి మందిరా బేడి పాత్రలో రమ్యకృష్ణను పెట్టి ఆ సీన్స్ ను రీషూట్ చేశారు. ఈ చిత్రంలో ఆకాశ్ పూరి సరసన యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో నడిచే లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. మరి ఈ చిత్రంతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందా.. కుర్రాడిలో తపన ఉన్నా.. హీరో మెటీరియల్ అయితే కాదు. కానీ యాక్టింగ్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు హీరోగా ఆదరిస్తారు. అన్నట్లు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి చార్మిల బంధం ఈ 'రొమాంటిక్'తో కూడా కాస్త బలపడిందట.