ముఖ్యాంశాలు

  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు చిన్న మెదడు పని చేయడం లేదు : రోజా
  • పేద విద్యార్ధుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం : రోజా
  • రాయచోటిలో రెస్టా రెంట్ ప్రారంభించిన రోజా

కడప జిల్లా: సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్‌లకు చిన్న మెదడు చెడిపోయిందన్నారు రోజా. పేదల కోసమే ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. రాయచోటిలోని ఓ ప్రైవేట్ రెస్టారెంట్‌ను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చిప్ విప్ స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్‌ సీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.