రాంచీలో రఫ్ ఆడించిన రోహిత్..!!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 19 Oct 2019 4:13 PM IST

రాంచీలో రఫ్ ఆడించిన రోహిత్..!!

రాంచీ: రాంచీ టెస్ట్‌లో రోహిత్ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక పక్క వికెట్ కాపాడుకుంటూనే పరుగులు రాబట్టాడు. 130 బంతుల్లో సెంచరీ చేశాడు. సెంచరీలో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సిక్సర్‌ కొట్టి మరీ రోహిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ కు టెస్ట్‌ల్లో ఇది ఆరో సెంచరీ. ఈ సిరీస్‌ మూడో సెంచరీ. అంతేకాదు.. 30వ టెస్ట్ ఆడుతున్న రోహిత్ .. 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

సిరీస్ లో రోహిత్ సిక్సర్ల మోత

మూడో టెస్టులో వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో మూడో సిక్సర్‌ కొట్టిన తర్వాత ఈ సిరీస్‌లో 16వ సిక్సర్‌ను రోహిత్‌ తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచిపోయాడు. వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మెయిర్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. 2018-19 సీజన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో హెట్‌మెయిర్‌ 15 సిక్సర్లు కొట్టాడు. ఆ రికార్డ్‌ను రోహిత్ బద్దలు కొట్టాడు.

హర్భజన్ రికార్డ్ బద్దలు

పనిలో పనిగా హర్భజన్‌ రికార్డ్‌ను కూడా రోహిత్ బద్దలు కొట్టాడు. 2010 -11 సీజన్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో హర్భజన్‌ 14 సిక్సర్లు కొట్టాడు. దీన్ని కూడా రోహిత్ దాటేశాడు.

Next Story