సెహ్వాగ్‌తో పోల్చడం సంతోషమే కానీ...: రోహిత్ శర్మ
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 1 Nov 2019 10:26 PM IST

న్యూఢిల్లీ: సెహ్వాగ్ లాంటి ఆటగాడితో పోల్చితే సంతోష పడేవారు ఎవరుండరు. రోహిత్ శర్మ కూడా అంతే తనను సెహ్వాగ్‌తో పోల్చడం సంతోషంగా ఉందన్నారు. కాని..సెహ్వాగ్ ఆట సెహ్వాగే ఆడగలరు. ఆయన సాధించిన రికార్డులు చాలా గొప్పవి. నా వరకు జట్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆడుతాను. సెహ్వాగ్ లా ఆడాలని జట్టు కోరుకుంటుంది. ఆడితే మంచిదే అన్నాడు రోహిత్ శర్మ.
టెస్టులో ఓపెనర్‌గా రావడం, బాగా రాణించడం సంతోషంగా ఉందన్నారు రోహిత్ . టెస్టుల్లో ఓపెనర్‌గా అవకాశం ఆలస్యంగా వచ్చినా.. తనకు మంచే జరిగిందన్నాడు. ఈడెన్ గార్డెన్‌లో పింక్ బాల్‌తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు రోహిత్.
Next Story