చెత్త రికార్డును మూటగట్టుకున్న హిట్‌మ్యాన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2020 10:12 AM GMTగురువారం రాత్రి ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ముంబయి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. అసలే హిట్‌మ్యాన్ గురించి సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరి చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అసలే రోహిత్ గాయం కారణంగా ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. కీరన్ పొలార్డ్ జట్టును ముందుండి నడిపించాడు. అయితే రోహిత్ ఫామ్‌పై వార్తలు వస్తున్న నేఫథ్యంలో.. హిట్‌మ్యాన్ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరగడంతో ఐపీఎల్ చరిత్రలోనే 13 సార్లు పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరిన బ్యాట్స్‌మెన్‌గా ఓ చెత్త రికార్డు తన పేరిట నమోదయ్యింది. ఇంతకుముందు హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్ ఇలాగే 13సార్లు డకౌటయ్యారు. హిట్‌మ్యాన్ ఇప్పుడు వారి సరసన చేరాడు
అంతేకాదు.. ప్లేఆఫ్స్‌లోనూ ఇలా డకౌటవ్వడం రోహిత్‌కిది మూడోసారి.. ఇప్పటివరకు ప్లేఆఫ్స్‌లో మొత్తం 19 ఇన్నింగ్స్ ఆడిన ముంబయి సారథి 12.72 సగటుతో 229 పరుగులే చేశాడు. హైదరాబాద్‌తో తలపడిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ హిట్‌మ్యాన్ బరిలోకి దిగి విఫలమయ్యాడు. కేవలం 4 పరుగులే చేశాడు. ఇప్పుడు మరోసారి విఫలమవడంతో అతడి ఫామ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గెలిచి ఫైనల్ చేరినా రోహిత్ విజృంభిస్తే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. మరి ఫైనల్‌లో అయినా రోహిత్ ఫామ్‌ను అందుకుంటాడో.. లేదో చూడాలి మరి.