యువ‌రాజ్‌, రోహిత్‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.. ఫ‌స్ట్‌ క్ర‌ష్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2020 3:11 PM GMT
యువ‌రాజ్‌, రోహిత్‌ల  మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.. ఫ‌స్ట్‌ క్ర‌ష్

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా క్రీడా టోర్నీల‌న్ని వాయిదా ప‌డ్డాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో వారు సోష‌ల్ మీడియ‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా భార‌త్ మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ల మ‌ధ్య ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది.

ప్ర‌స్తుత జ‌ట్టుకు అప్ప‌టి జ‌ట్టుకు మ‌ధ్య గ‌ల తేడాను తెల‌పాల‌ని రోహిత్ శ‌ర్మ యువీని అడిగాడు. ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు కుర్రాళ్లు నుంచి అనుకున్న స్థాయిలో గౌర‌వం ల‌భించ‌డం లేద‌ని యువ‌రాజ్ అన్నాడు. మ‌నం జ‌ట్టులోకి వ‌చ్చినప్పుడు సీనియ‌ర్ ఆట‌గాళ్లంతా ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెలిగేవారు. వారు కూడా ప్ర‌తి ఆట‌గాడిని స‌మానంగా చూసేవారు. ఎవ‌రైన త‌ప్పు చేస్తే.. ఏదీ త‌ప్పో, ఏదీ ఒప్పో స‌వివ‌రంగా చెప్పేవారు. మ్యాచ్ అనంత‌రం మీడియాతో ఎలా మాట్లాడాలో వారి నుంచి చాలా నేర్చుకున్నామనే వాళ్ల‌మ‌ని చెప్పాడు. అందుకే అప్ప‌టి ఆటగాళ్లంగా ఆట‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారార‌ని అన్నాడు. ప్ర‌స్తుత జ‌ట్టులో నువ్వు(రోహిత్ శ‌ర్మ‌) విరాట్ కోహ్లీ మాత్ర‌మే సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌ని అన్నాడు. వీరిద్ద‌రు మాత్ర‌మే అన్ని ఫార్మాట్ల‌ల‌లో ఆడుతున్నార‌ని.. మిగ‌తా వారు అన్ని ఫార్మాట్ల‌ల‌లో రాణించ‌లేక‌పోతున్నార‌ని అన్నాడు.

దీని గురించి రోహిత్ స్పందించాడు. నేను జ‌ట్టులోకి వ‌చ్చేట‌ప్ప‌టికి చాలా మంది సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఉండేవారు. నేను, సురేష్ రైనా, షీయూష్ చావ్లా మాత్ర‌మే జూనియ‌ర్లం. ప్ర‌స్తుతం నేను సీనియ‌ర్ ఆటగాడిని.. అయిన‌ప్ప‌టికి జూనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో మంచి సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాన‌ని తెలిపాడు. ఇక భార‌త యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ను తాను ద‌గ్గ‌రి నుంచి చూశాన‌ని.. మీడియా పంత్ గురించి రాసేట‌ప్పుడు నిజాలు తెలుసుకొని రాయాల‌న్నాడు. మ‌ధ్య‌లో యువ‌రాజ్ మాట్లాడుతూ.. ఇప్ప‌టి యువ ఆట‌గాళ్లంతా టీ20, వ‌న్డేలు ఆడ‌డానికే మొగ్గుచూపుతున్నార‌ని, సాంప్ర‌దాయ టెస్టు క్రికెట్‌ను ఆడేందుకు ఎవరూ ఇష్ట‌ప‌డ‌డం లేదన్నాడు.

ఓ ప్ర‌శ్న‌కు బ‌దులు ఇస్తూ యువ‌రాజ్ సింగ్ త‌న ఫ‌స్టు క్ర‌ష్ అని చెప్పాడు రోహిత్ శ‌ర్మ‌. తాను తొలిసారి టీమ్ బ‌స్సు ఎక్కిన‌ప్పుడు తెలియ‌క యువ‌రాజ్ సీటులో కూర్చొన్నాన‌ని, స‌న్‌గ్లాసెస్ పెట్టుకుని చాలా స్టైలిష్ గా యువీ బ‌స్సులోకి ఎక్కాడ‌న్నాడు. త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి వెల్‌క‌మ్ చెప్పాడ‌ని, త‌న సీటులోంచి లేచి వేరే సీటులో కూర్చొవాల‌ని సూచించాడ‌ని రోహిత్ అన్నాడు.

Next Story
Share it