బుమ్రా బౌలింగ్ శైలిని అనుక‌రించిన హిట్‌మ్యాన్ డాట‌ర్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2020 2:32 PM GMT
బుమ్రా బౌలింగ్ శైలిని అనుక‌రించిన హిట్‌మ్యాన్ డాట‌ర్‌..

టీమిండియా పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా బుమ్రా బౌలింగ్ శైలి కాస్త విభిన్నంగా ఉంటుంది. అత‌డి బౌలింగ్ యాక్ష‌న్ ను ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది అత‌డి బౌలింగ్ యాక్ష‌న్‌ను అనుక‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తాజాగా ఓ 15నెల‌ల పాప బుమ్రా బౌలింగ్ యాక్ష‌న్ ను అనుక‌రించింది. ఆపాప బౌలింగ్‌కు బుమ్రా కూడా ఫిదా అయిపోయాడు. ఆ పాప మ‌రెవ‌రో కాదు హిట్‌మ్యాన్ రోహిత్‌శ‌ర్మ గారాల ప‌ట్టి స‌మైరా.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించ‌డంతో సామ‌న్య జ‌నంతోపాటు సెల‌బ్రిటీలు ఇంటిప‌ట్టునే ఉంటున్నారు. ఈ క్వారంటైన్ టైంలో కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా కాలం గడుపుతున్నారు. ఈ సంద‌ర్భంగా హిట్‌మ్యాన్ రోహిత్‌., అత‌ని భార్య రితికా కూతురితో స‌ర‌దాగా ఆడుకుంటున్నారు. రోహిత్ స‌తీమ‌ణి రితికా.. బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడ‌ని స‌మైరాను అడిగింది. దీంతో వెంటనే బుమ్రా యాక్షన్‌ను అనకరించడంతో రోహిత్‌, రితికాలు గట్టిగా నవ్వుకున్నారు.

కాగా.. ఈ వీడియోను బుమ్రా తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘నా కంటే సమైరానే బాగా చేసిందనుకుంటున్నా. ఆమె నన్ను అభిమానించే కంటే నేనే ఎక్కువగా ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయా'అని పేర్కొన్నాడు. ఈ పోస్టుపై నెటిజ‌న్లు లైకులు, కామెంట్ల‌తో త‌మ స్పంద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.Next Story
Share it