ప్రభుత్వం కీలక నిర్ణయం..రంగంలోకి రోబోలు
By రాణి Published on 29 April 2020 8:44 PM ISTకరోనా వైరస్ సోకిన బాధితులకు వైద్య సేవలందించేందుకు రోబోలు రంగంలోకి దిగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు చికిత్సల అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి కూడా వైరస్ సోకుతుండటంతో రంగంలోకి రోబోలను దించాలని నిర్ణయించింది. వైద్య సిబ్బంది స్థానంలో వచ్చే రోబోలు పేషెంట్లకు ఆహారం, మందులను అందించనున్నాయి. ప్రభుత్వం రంగంలోకి దింపే ఈ రోబోలు ఒకేసారి 40 కేజీల ఆహారం, మందులను సరఫరా చేయగల కెపాసిటీని కలిగి ఉన్నాయి.
Also Read : ఇర్ఫాన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
తొలి ప్రయత్నంగా మూడు రోబోలను నెల్లూరు జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మూడు రోబోలు పేషెంట్లకు ఏ లోటు రాకుండా సేవలందిస్తున్నాయి. కాగా..గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదవ్వగా..మొత్తం కేసుల సంఖ్య 1332కి పెరిగింది. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read :సెహ్వాగ్‌కు అంత టాలెంట్ లేదు.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు