ఇర్ఫాన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

By రాణి  Published on  29 April 2020 11:10 AM GMT
ఇర్ఫాన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

విలక్షణ నటుడు, విలనిజానికి కేరాఫ్ అడ్రస్ అని పేరు తెచ్చుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతితో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రముఖ నటులంతా ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. సినీ పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది..మీ అకాల మరణం చిత్ర పరిశ్రమకే తీరని లోటంటూ ట్వీట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ కూడా ఇర్ఫాన్ ను కడసారి చూసే అవకాశం లేకపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Also Read : ఇర్ఫాన్ ఖాన్ మృతితో దిగ్భ్రాంతికి లోనైన మహేష్

ప్రధాని మోదీ, బిగ్ బి, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, నాని, రామ్ చరణ్, గీతా ఆర్ట్స్, ప్రకాష్ రాజ్, మెహరీన్, విరాట్ కోహ్లీ, శ్రద్ధా కపూర్, సుస్మితా సేన్, సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, ప్రియాంక చోప్రా, సైనా నెహ్వాల్, అజయ్ దేవగన్, శ్రీకాంత్, సింగర్ శ్రేయా ఘోషల్..ఇంకా ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, నటీ నటులంతా ఇర్ఫాన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.Next Story