విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఒక ప్రమాదకరమైన క్యాన్సర్ తో బాధపడుతూ బుధవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇర్ఫాన్ మృతితో అటు చిత్ర పరిశ్రమంతా విషాదంలో మునిగిపోయింది. ఇలాంటి నటుడిని కోల్పోవడం పరిశ్రమ దురదృష్టం అంటూ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా ఇర్ఫాన్ మృతి తీరని లోటు అంటూ సంతాపం ప్రకటించారు.

Also Read : కంటైన్మెంట్ ఫ్రీ జోన్ గా మలక్ పేట్

ఇర్ఫాన్ ఖాన్ తెలుగులో నటించిన ఏకైక సినిమా సైనికుడు. ఈ సినిమాలో ఇర్ఫాన్ పప్పు యాదవ్ గా విలన్ పాత్ర పోషించినప్పటికీ అక్కడక్కడా తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు.తాజాగా..సూపర్ స్టార్ మహేష్ బాబు ఇర్ఫాన్ ఖాన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఎంతో గొప్ప నటుడు ఇంత త్వరగా విడిచి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్ చేశారు.రాణి యార్లగడ్డ

Next Story