నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. తెట్టు జంక్షన్ దగ్గర ఆయన కారుకు మరో వాహనాన్ని ఢీ కొట్టిన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కారులో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ ఈ రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కారు మాత్రం ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో డ్రైవర్ ఉండగా.. అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు.