నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

By Newsmeter.Network  Published on  13 Feb 2020 10:36 AM GMT
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు.. స్కూటీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. చిట్యాల శివారులోని ఓ వివాహా వేడుకకు హాజరయ్యేందుకు వెలుతుండగా..స్థానిక రైల్వే స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకోబోతున్న మోపెడ్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో దండు మల్కాపురం గ్రామానికి చెందిన బిక్షపతి, చెన్నారెడ్డి గూడెంకు చెందిన నరసింహ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బస్సు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it