రాజస్థాన్‌లో సిలిండర్‌ పేలుడు జరిగింది. శనివారం బార్మేర్‌ నగరంలో సందీప్‌ అనే వ్యక్తి ఇంట్లో ఈ పేలుడు జరిగింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు మహిళతో సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు ఇళ్లులు కూలిపోయాయి. ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్‌ పేలిందని పోలీసులు చెబుతున్నారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న మరో ఇళ్లు కూడా కూలిపోయిందన్నారు. శిథిలాల కింద కుటుంబ సభ్యులు చిక్కుకున్నారని, వారిని వెలికి తీసి స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. మృతులు లాల్‌చంద్‌, రమేష్‌, హేమలత, రేఖ, తారాచంద్‌లుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.