హైదరాబాద్‌: చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట పీఎస్‌కు చెందిన ఎస్‌ఐ శ్రీనివాస్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. శ్రీనివాస్‌ను మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు పోలీసులు. జబర్దస్త్‌ పీఎస్‌ పరిధిలోని మెరిడియన్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.