చిత్తూరు జిల్లాలో ఘొర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2019 1:52 PM GMT
చిత్తూరు జిల్లాలో ఘొర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి..!

చిత్తూరు జిల్లా: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం చిత్తూరు-బెంగళూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్‌ దగ్గర వాహనాలపై కంటైనర్‌ బోల్తాపడింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆటో, ఓమ్ని వ్యాన్‌, బైక్ పైకి కంటైనర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చీకటి పడటంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది.

ప్రమాదంపై చంద్రబాబు ఆవేదన..!

రోడ్డుప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి,అనేకమంది గాయపడడంపై చంద్రబాబు ఆవేదన చెందారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

Next Story
Share it