బ్రేకింగ్ న్యూస్: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
By సుభాష్ Published on 1 March 2020 5:15 PM IST
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట ప్రాంతంలో అతివేగంగా వెళ్తున్న తుఫాన్ వాహనం వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్సత్రికి తరలించారు.
ప్రమాదం జరగడానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. కాగా, గుంటూరు రూరల్ మండలం ఏటుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా కాకుమానుకు చెందిన పొగడ్త వీరలక్ష్మీ (46), పొగడ్త రమణ (45), సమాధుల శ్రీనివాస్ (50) సమాధుల వన్నూరు (53), సమాధుల సీత (65), మరొకరు ఉన్నారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.