స్కూల్‌ బస్సు రెండేళ్ల బాలుడిని బలిగొంది. మేడ్చల్‌లోని నవదుర్గ నగర్‌లో రెండేళ్ల బాలుడిని స్కూల్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సును డ్రైవర్‌ రివర్స్‌ తీసుకునే క్రమంలో వెనుకున్న బాలుడు బస్సు టైర్ల కింద పడిపోవడంతో మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.